ముంబైలో తెరుచుకున్న రెస్టారెంట్లు, జిమ్‌ సెంటర్లు

ముంబైలో తెరుచుకున్న రెస్టారెంట్లు, జిమ్‌ సెంటర్లు

కరోనా కారణంగా ముంబైలో మూతపడ్డ పలు రెస్టారెంట్లు, జిమ్‌ సెంటర్లు రెండు నెలల తర్వాత ఇవాళ(సోమవారం) తెరుచుకున్నాయి. పాజిటివిటీ రేటు, ఆక్సిజన్‌ బెడ్‌ల సామర్థ్యం ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఐదంచెల అన్‌ లాక్‌ను ప్రకటించింది. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ముంబైలో సోమవారం పలు సేవలు ప్రారంభమయ్యాయి. అయితే కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పోరేషన్‌ (BMC) ట్వీట్‌ చేసింది. బృహన్‌ ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (బెస్ట్‌) బస్సులు 100 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో ప్రయాణికులను అనుమతించాయి. రైల్వే కూడా ప్రత్యేక రైలు సేవలను ప్రారంభించింది.

 అంతేకాదు నిత్యావసర సరుకుల షాపులు సాయంత్రం 4 గంటల వరకు తెరిచే ఉంటాయని తెలిపింది. బహిరంగ ప్రదేశాలు, పార్కులు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఓపెన్ గా ఉండనున్నాయి. వాకింగ్‌, సైక్లింగ్‌కు అనుమతిస్తున్నట్లు BMC తెలిపింది.